పుట:హరివంశము.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ .8.

199

వ. ఇట్లు సేయవై తేని నీవ యెఱుంగు దనిన యంధకువచనంబులకుం గ్రోధాంధ
     లోచనుం డై యాక్షేపశిథిలోత్తంసుం డగుకంసుండు దిగ్గన లేచి పోయెఁ దక్కిన
     యందఱు [1]ధిగ్వచనంబులం దమతమమందిరంబులకుం జనిరి తదనంతరంబ.98

కేశి యనురాక్షసుఁ డశ్వరూపధరుం డై శ్రీకృష్ణునకుఁ గీడు సేయఁ బూనుట

శా. అక్రూరుం డటపోకమున్న మధురేశాజ్ఞప్తుఁ డై కేశినా
     మక్రూరాసురుఁ డశ్వరూపమున [2]నున్మాదాతిరేకంబుచే
     నాక్రాంతం బగునంతరంగమున బృందారణ్యముం జొచ్చి దు
     ర్వీకాంతిం జరియించె గోకుల ముద్వేగిల్ల వేగోద్ధతిన్.99
సీ. వెనుకకాళ్లులు రెండు వీఁకమై జోడించి తాఁచుఁ గొన్నింటి డెందములు పగుల
     ఘనకరాళోగ్రవక్త్రంబునఁ గబళించి కలచుఁ గొన్నింటిఁ బెన్గండ లురుల
     నుగ్రపాతమునఁ బై నుఱికి ఖురంబులఁ ద్రొక్కుఁ గొన్నింటిఁ దుత్తురుము గాఁగఁ
     బ్రకటవేగంబు దుర్వారంబుగా బిట్టుదాఁకుఁ కొన్నింటి గాత్రములు వ్రయ్యఁ
తే. గండమున వెండ్రుకలు భయంకరతఁ జెదరఁ, గన్నుఁగొనల నిప్పులు రాలఁ గర్ణయుగము
     బిగిసి వెఱపు పుట్టింప నిప్పగిది నసుర, గోగణముఁ జంపి పరిమార్చె గోపతతుల.100
తే. పసులనెత్తురు గ్రోలుచుఁ బసఁగ మనుజ, పలలములు దించుఁ దిరుగునాఖలునిచెయిది
     గతిపయాహంబులంద యక్కాన కాటి, కరణి బహుకపాలాస్థిసంకటము నందె.101
వ. ఇవ్విధంబున నెవ్వలనను గోవులకుఁ జరియింప రాక యెద్దెసల మెలంగుత్రోవలు
     గట్టువడియె నేవెరవున నీయాపద దరియింతు మేమి సేయుదుము కృష్ణుం డూర
     కున్నవాఁ డేది శరణం బనుచు వ్రజౌకు లెల్లం దల్లడిల్లుచుండ నొక్కనాఁడు.102
మ. అడవిం గోల్పడుప్రాణి యెయ్యదియు లే కాటోప మేపార న
     చ్చెడుగం డుగ్రతఁ దద్వ్రజంబుదెసకున్ శీఘ్రంబ యేతెంచె ను
     గ్గడువై మేను దలిర్ప హేషితము లాకాశంబుఁ బూరింప దం
     దడిఁ బాదాహతమై మహీరజము గ్రందం బర్వ సర్వాశలన్.103
వ. దాని నంతంతం గని వ్రేపల్లెం గలగోపాలురును గోపికలును సబాంధవంబుగాఁ
     గృష్ణ కృష్ణ రక్షింపు రక్షింపు మనుచు నాజగన్నాథుదిక్కునకుఁ బఱతెంచినం గని
     యోడకుం డనుచు నద్దేవుండు.104
క. నీపాలి[3]మృత్యువై యిదె, యేపున నున్నాఁడ నిచట నేనుఁ దురగరూ
     పోపహిత దుష్టదానవ, వే పఱతెమ్మనుచుఁ గేలువ్రేయుచు నార్వన్.105

  1. నిర్వచనంబులం
  2. మన్మత్తాతి
  3. మిత్తినై