పుట:హరివంశము.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3.

79


వ.

సవిశేషార్చనాతోషితుం గానించి యతం డాచార్యుండుగా గదాకౌశలం బంత
యుం దుది ముట్ట నభ్యసించె నంతఁ గొంతకాలంబునకు నుగ్రసేనాదియాదవ
వృద్ధులు రత్నంబు కృష్ణునకుం జేపడమి లెస్సగా నెఱింగి పోయి బలభద్రున
కవ్విధంబు దెలిపి యతనిం దోడ్కొని చనుదెంచి రనంతరంబ.

219


సీ.

అక్రూరుఁ డమ్మెయి నమ్మహారత్నంబు దనకు వచ్చిన ననుదినము గురియు
పసిఁడియు మణులు నల్పంబు నాత్మోపభోగమునకుఁ గొనక దానములు ధర్మ
ములు హుతంబులు బంధుపూజనంబులు నూర్జితములుగ జరపుచుఁ దనరి యెందు
నతులితంబై దానపతి యనుపేరు ప్రఖ్యాతి నొందగ నిత్యయజన మొకఁడ


తే.

కృత్యముగ నిష్ఠతోడ దీక్షించియుండె, నఱువదియు రెండు నేఁడు లిత్తెఱఁగుతోడ
నెడప కెపుడును మారియు నడఁగె వఱపు, లుడిగె భద్రంబు వర్ధిల్లుచుండె నుర్వి.

220

అక్రూరుఁడు విడిచిపోవుటవలన ద్వారకయం దుత్పాతంబులు పుట్టుట

వ.

ఆనడుమ నొక్కతఱిఁ దదీయబాంధవు లగు భోజులు శత్రుఘ్నుండను యాదవు
వధియించిన.

221


తే.

కలఁక పుట్టి యాదవులలో నిలువ ననువు, గాక తానుజుట్టలుఁ దొలఁగంగఁ జనియె
నమ్మహాత్ము డతనిపోక యాదిగాఁగఁ, బుట్టె బహుదోషములు యదుపురమునందు.

222


వ.

అట్టి యనావృష్టిమారిదవాగ్నివ్యాధ్యాద్యుపద్రవంబులు సూచి వృష్ణి [1]ప్రము
ఖులు దమలోనం జింతించునెడ వసుదేవనందనుండు.

223


క.

మున్నెన్నడు లే వొక్కట, యున్నయునికిఁ బెక్కుకీళ్లు నుగ్రమ్ముగ ను
త్పన్నములై మానక యి, ట్లున్నవిధమునకు నిమిత్త మూహింపఁదగున్.

224


వ.

ఎయ్యది యేని నొక్క.టి లేక యిట్లేల యగు ననిన నందకుం డనుకులవృద్ధుం
డతని కిట్లనియె.

225


క.

జననుత విను మక్రూరుని,జనకుండు శ్వ[2]ఫల్గుఁ డున్నజనపదమున సం
జనితంబులు గా వెన్నఁడు, ననుపమదుర్భిక్షమారికాదిభయంబుల్.

226


వ.

కాశీశ్వరుదేశంబునం దవగ్రహపీడ పొడమినం బెద్దలు సెప్ప నతండు [3]శ్వఫల్గుం
బ్రార్థించి తోడ్కొనిపోయి యద్దురితంబులఁ బాపికొనియెఁ దొల్లి యా కాశ్యుపత్ని
గర్భిణియై సముచితసమయంబునఁ బ్రసవింపక పండ్రెండేండ్లు చూలు మోచిన
నచ్చెరువు నొంది యవ్విభుండు నిజప్రభావంబునఁ దద్గర్భంబు గూఁతురుగా
నెఱింగి తల్లీ మీతల్లికిం గ్లేశంబు సేయక వెడలుము భవదీయవదనావలోకనంబున
నన్నుఁ గృతార్థుం జేయవలదే యనినం గడుపులో నున్నకన్య తండ్రిం బేర్కొని.

227


క.

అనుదినమును నేఁడాదిగ, ననఘా యొక్కొక్కమొదవు నవనిసురున కి
చ్చిన నింక వత్సరత్రయ, మున కేను జనింతుఁ జేయుము మదీప్సితమున్.

228
  1. ముఖ్యులు
  2. ఫల్కు
  3. శ్వఫల్కుం