పుట:హంసవింశతి.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxiii


సీ. మగని ప్రక్కనె యుండి తగఁజేరి జోకొట్టి
         మోసపుచ్చని దేటి ముద్దరాలు
    పసుల గోడలనైన వసుధ నిచ్చెనలేక
         యెక్కనేరని దేటి యెమ్మెలాఁడి
    తలవరుల్ గనుగొన్నఁ దప్పునొప్పు ఘటించి
         బొంకనేరని దేటి పుప్వుబోఁడి
    దొరలు గద్దింపఁ గల్లరివార్త నిజముగా
         నిర్వహింపని జేటి నీటుగత్తె.

తే. అత్తమామల గృహకర్త లగుచు మెలఁగు
    నట్టి ధూర్తుల నెల్ల నోరదిమి గదిమి
    పొంచి యుపనాథుతోడఁ గ్రీడించి మించి
    చక్కటికి దిద్దుకొనని దే సరసురాలు? (శుక. 1.139)

సీ. కోటగోడల నైన మీటుగా నెగఁబ్రాఁకి
         దాఁటనేరని దేటి తలిరుబోఁడి
   ఘుమఘుమార్బటితోడ ఘోషించు నదులైన
         నీఁదిపోవని దేటి యెమ్మెలాఁడి?
   తనమీఁది తప్పు నొక్కనిమీఁద నిజముగాఁ
         బెట్టనేరని దేటి బిసరుహాక్షి
   ధవుఁడైనఁ దనజాడ తగదని పట్టిన
         నిర్వహింపని దేటి నీటుకత్తె

తే. తలవరులు గన్నచో లేని తాల్మిఁబూని
    బొంకు తథ్యంబు తథ్యంబు బొంకు గాఁగ
    నెంచి యుపనాథుతోడఁ గ్రీడించి మించి
    చక్కటికి దేని దదియేటి సరసురాలు? (హంస. 1-102)

పసులదొడ్డి గోడలు దాఁటవలె నన్నాడు కదిరీపతి. అదేమి లెక్క! కోటగోడలు దాఁటవలె నన్నాఁడు నారాయణ కవి. నిండు వఱదలతోడి నదు లీఁదవలెనని కదిరీపతి చెప్పలేదు.