పుట:హంసవింశతి.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 145

ఉష్ణిక్ అనుష్టుప్ బృహతీ పంక్తి త్రిష్టుప్ జగతీ అతిజగతీ శక్వరి అతిశక్వరి అష్టి అత్యష్టి ధృతి అతిధృతి కృతి ప్రకృతి ఆకృతి వికృతి సంకృతి అభికృతి ఉత్కృతియను నిరువదాఱు ఛందస్సులును, బైలజ రోమజ వాసిష్ఠ సోమ సూర్యాది సిద్ధాంతంబులును, ఉపమా రూపక దీపావృత్తాక్షేపార్థాంతరన్యాస వ్యతిరేక సమాసోక్త్యతిశయోక్త్యుత్ప్రేక్షా హేతు సూక్ష్మ లేశ క్రమ సర్వ ప్రియోర్జస్వ పర్యాయోక్తి సమాహితోదాత్తాపహ్నవ శ్లేషోక్తి తుల్యయోగితాప్రస్తుతప్రశంసా వ్యాజస్తుతి నిదర్శనా సహోక్తి పరివృత్తి సంకీర్ణ విభావనాద్యలకారంబులును, అమరామరశేష విశ్వశాశ్వత శబ్దార్ణవ యాదవ వైజయంతీ నానార్థ రత్నమాలికా మేదినీ హలాయుధ వాగురి కేశవ తారపాల ధన్వంతరీ ధరణీ ధనంజయ రభస విశ్వప్రకాశ మాధవ చింతామణి జయ ప్రతాప శుభాంకాజయపాల క్షీరస్వామ్యేకాక్షరాది నిఘంటువులును, సంస్కృత పాకృత శౌరసేని మాగధి పైశాచి చూళికోక్త్యపభ్రంశాంధ్రము లనునష్టభాషలును, స్వర నిత్యసమాస ప్లుత కాక్వాదేశ ప్రాది ప్రాదియోగ వృద్ధ్యభేద దేశీయోభయ శకంధ్వ ఖండ విభాగ వికల్ప ప్రభునామ భిన్నవర్గ సంయుక్త వికల్ప సంయుక్తము లను చక్కటి యెక్కటి పోలికలును, సరసానుస్వార ఋజువు లనంబరగు యతుల విధంబులును, సమనామ సంయుక్త సంధిగతోభయ ప్రాది వికల్ప బింద్వర్ధబిందు ఋప్రాస త్రికార సమలఘుప్రాస మైత్ర్యంత్య దుష్కర ద్వంద్వ త్రిప్రాస చతుర్థప్రాసా ద్యష్టాదశ ప్రాసంబులును, మగణ యగణ రగణ సగణ తగణ జగణ భగణ నగణంబులును, జంద్రేంద్ర సూర్యగణంబులును, నుపగణంబులును బ్రయోగించి, తత్తద్దేవతాలక్షణంబు లెఱింగి శయ్యాశైలీ భేదంబు లెఱంగి ద్రాక్షా కదళీ నారికేళ పాకంబుల కవిత్వ రచన లెఱింగి సకల విద్యా పారంగతుండై యుండె నప్పుడు. 128

తే. ఆతఁడు తన సతు లిద్దఱు నహరహంబు
 వాదొనర్చుట సైఁపక వలపుఁ గులుకు