పుట:హంసవింశతి.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుజరాతి జిగిసిస్తు గోట్లదాఁపిన డాలు
రహి మించు పైఠిణీరవికఁ దొడిగి
ఘుమ్ముఘుమ్మని తావి గ్రమ్ము చొకాటంపుఁ
గలపంబు సొగసుగాఁ గలయ నలఁది
తళుకుతళ్కునఁ గాంతి చిలుకఁ గుల్కెడు జాతి
మణిభూషణంబులు మమతఁ దాల్చి
తే. తిలక మొగిఁదీర్చి మితభుక్తి సలిపి వెంట
బూమె లెఱుఁగని యొకపాటి బుడుత, యాకు
మడుపు లందీయ మోహంబు మరులు గొల్ప
వెడలె నల భామ నిజకేళివేశ్మసీమ. 120

వ. అటుల వెలువడి. 121

తే. తనదు ప్రాణంబు దైవంబు తల్లి తండ్రి
యనుచుఁ జెలియైన యల రాజహంసమున్న
దివ్యనవరత్నఖచితదేదీప్యమాన
కనకపంజర మొక్కింత గదిసి నిలిచె. 122

చ. నిలిచి దరస్మితంబయిన నెమ్మొగ మించుక వంచి యాత్మఁ దాఁ
దలఁచినకార్యమెల్లఁ బ్రమదంబునఁ దిన్నని కల్కిపల్కులం
దెలిపిన రాజహంస సుదతీమణిఁ గన్గొని పక్షయుగ్మముం
దలఁ గదలించి యందుకు మనంబునఁ జింతిలి యప్పు డిట్లనున్‌. 123

ఉ. అక్కట! భర్తకాఁపురము నాఱడిపుచ్చి నృపాలమౌళితోఁ
జొక్కి రమించునందులకుఁ జొచ్చినఁ, దావక బంధువర్గముల్
తక్కువ సేతురమ్మ! చరితవ్రతముల్ చెడునమ్మ! జాతికిన్
బక్కున నిందఁ జెంది తలవంపులు దెత్తురఁటమ్మ! మానినీ! 124