పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

47

భౌమినీ నూతనపంచబాణునకు 740
సకలపురాణశాస్త్రవిధిజ్ఞునకును
వికటశాత్రవబలవిచ్ఛేదనునకు
శరణాగతారాతిసంరక్షకునకు
నరపతి సింహాసనస్థాపకునకు
గురుతరరావిళ్లకులభూషణునకు 745
ధర నెన్నఁదగులింగధారుణీపతికి
నంకితంబుగను నే నార్యులు మెచ్చ
పొంకించి రచియింపఁబూనిన యట్టి
పరమసౌగంధికాప్రసవాపహరణ
చరితంబునకుఁ గథాసరణి యెట్లనిన.[1] 750

  1. అయ్యపనాయకునికుమారుఁ డైనకొండనృపతి కిద్దఱు పుత్త్రు లున్నట్లు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారములోని వ్రాతప్రతియం దున్నది.
    ఆకొండనృపతి బాహాబలోదగ్ర
    భీకరశౌర్య గంభీరచాతుర్య
    వినయవివేకప్రవీణు లైనట్టి