పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

403


రాయమున హరు రాజరాజును గెల్చి
జయలక్ష్మి చేకొని సత్కీర్తినడయు
మన విని కర్ణుఁ డత్యంతమోదమున
కనకాంబరుని మోము గనుఁగొని పలికి 1105
నలినలోచన జగన్నాథ శ్రీకృష్ణ
చెలువంద నీవు మెచ్చినవాఁడె ఘనుఁడు
క్రొవ్వున గొన్ని పల్కులు పల్కె నన్ను
కవ్వడి నినుఁ జూచి కాచితి నతని
రాజీవనాభ విక్రమశక్తి నిపుడు[1]1110
నేఁ జెప్పఁగలబుద్ధి నీవె చెప్పితివి

కర్ణుఁడు భీష్మ ద్రోణాదుల దూషించుట

కలక దొలంగె సత్కరుణ వాటిల్లె
బలువైన దొకవిన్నపంబుఁ దెల్పెదను
గురుడుఁ దుర్మార్గుండు గురుసుతుఁ డల్పుఁ
డరయ భీష్ముడు వారికంటెను పెంకె 1115
కడు కృపాచార్యుఁడు కపటమానసుఁడు
 

  1. రాజీవనాభ యాశ్రితభక్తి నిపుడు(ట )