పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

374

సౌగంధిక ప్రసవాపహరణము


నిరుపమాంబకముల నించు సవ్వేళ
మార్తాండసుతునకు మణిమంతునకును
కీర్తింపఁదగు రణకోళి సంధిల్లె
తివిరి ఘటోత్కచదేవధ్వజులకు
బవరంబు చాల దెప్పరమయ్యె నపుడు
అమరేంద్ర సుతునకు యక్షనాథునకు
సమరంబు గల్గె నాశ్చర్యంబు గాఁగ
నలకూబరునకు ద్రోణతనూజనకును
గలితభయంకరకదనంబు చెల్లె635
నెరయ గాంగేయమణిగ్రీవులకును
గరమొప్ప ఘోరసంగరమువాటిల్లె
మారుతాత్మజునకు మణికేతనునకుఁ
దారుణంబైన యుద్ధము సంభవించె
హరికేతనునకు ద్రోణాచార్యునకును640
నరుదంద నాహనం బగ్గల మ్మయ్యె
చెలువొందఁ గృపునకు: జిత్రకాయునకుఁ
బలువైన జగడంబు ప్రకటించి మించె
విలసిల్లు కురురాజవీరసేనలకు