పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

సౌగంధిక ప్రసవాపహరణము



యదరించి బెదరించి యటునిటుఁబరసి 350
బిట్టల్క వెన్నంటి భీకర ప్రౌఢి
నట్టహాసము చేసే నమ్మహాబలుడు
అంతట దానవయక్ష సైన్యములు
పంతము ల్చాలించి ప్రతిభలు డించి
యదరి పారెడువారు సరచెడివారు355

బెదరి చూచెడువారు భీతిల్లి 'నేలఁ
బడి కావు మనువారు పదరికల్" చెదరి
తదఁబడువారు పొద ల్డూరు వారు[1]
తరువు లెక్కెడివారు ధైర్యము ల్దూలి
శరణనువారు విచ్చలవిడి దిశల360

పరువు లెత్తెడువారు పడిన గాత్రముల
మరువు చేరెడువారు మరిగూయ వెఱచి
కన్నులు ముకుళించి కదలనివారు
అన్నన్న ! యికఁ బ్రోవు మనియెడు వారు


  1. పడి కాపు మునువారు బడలికల్ దట్టి
    తలపడి పారి పొద ల్డూరు వారు (చ)