పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

సౌగంధిక ప్రసవాపహరణము




చొచ్చి నేఁగొని సోదు సూనంబు లనినఁ;
గనుగవ విస్ఫులింగము లుప్పల్లి
జననాథుఁ గనుఁగొని సైనికు లనిరి
చనుపరివలెనే యిచ్చటికి నేతెంచి
మనుజకీటమ ! యోరి, మము సడ్డగొనక
శంకలేక మదించి శౌర్యంబు మించి
పంకజాకరతీరభాగంబుఁ జేరి
కొంకక బొంకించి కొని పోదలంచి
చంక దుడ్డును వెండి శరణార్థి దగు నె![1]
నరుఁడవు నీ దానవులము మేము
వెరువవు ప్రజ్ఞలు విడువవు నిన్ను
కరవాలముల కడికండలు చేసి
పరమహర్షంబున భక్షింతు మనుచు
నడిదముల్ ఝులిపించి యత్యుగ్రు లగుచు
వడి జుట్టుముట్టిన వాయానందనుఁ డు
కనుబొమ ల్ముడి పెట్టి కను లెఱ్ఱజేసి

  1. చంక దుడ్డును వెంట శరణార్థి యగునె (త)