పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

సౌగంధిక ప్రసవాపహరణము



గనుఁగొనఁగలిగె నాకాంక్ష లీడేరె
అహికేతనునిఁ గూర్చి హస్తినాపురము115
విహితంబుగా నిత్తు వేడ్కతో మీకు
మక్కువ నీవిందు మలయుచునుండు
గ్రక్కున సౌగంధికములు నేదెత్తు
ననిన సంతోషించి యంజనీకూర్మి
తనయుని పాండునందనుఁడు వీక్షించి120
కపినాథ మీ కటాక్షంబున మేమె
యపరాధి యగు కౌరవాధీశుఁ దునిమి
ధర్తనందను చేత ధారుణి యెల్ల
నర్మిలి యేలింతు మనఘచారిత్ర
తరలక నరునికేతనమున నిల్చి125
సొరిది మాబలశక్తి చూతురుగాని
గరిముతోఁ గాంచనకమలము లున్న
తెఱఁగు లామార్గము ల్దెలుపవె యనిన[1]

 

  1. a .తెఱుగును మార్గము ల్దెలఁపవే యనిన (క )
        b. తెఱగుల మర్మము ల్దెలుపుడి యనిన (1378)
        c. తెరగుల మర్మంబు దెలుపుడీ యనిన (చ)