పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

సౌగంధిక ప్రసవాపహరణము

వామాక్షీ చలపట్టి వదలవు మీఁద
నేమిగా నున్నదో యెఱుఁగంగరాదు,
నినుఁ దూర నేమి నా నేరమెగాదె!
యన విని పాంచాలి యనిలజుఁ జూచి,
అమ్మక్క చెల్ల! యో యనిలతనూజ! 1170
ఇమ్మెయి ననుఁదూరి యేల పల్కెదవు?
ధర్మ నందను కూర్మి తమ్ముండ వగుట
ధర్మశాస్త్రము లాడి తప్పరా దనుచు
మొరలుపెట్టుచు నుండు మొనసిన నెపుడు
విరులు గోరుట లవివేకమే నాథ! 1175
భీముఁ డాడినమాట చెనికె నటన్న
భూమి విశేషంబు బొంకుట గాదు
పెక్కు గా నాసలు బెట్టుటకంటెఁ
గ్రక్కున లేదనఁ గలుగుపుణ్యంబు,
పట్టినప్రతిన నేపట్టుననైన 1180
గట్టిగా వదలని ఘన ధైర్యశక్తి
నరునకుఁ గాక పదునాల్గులోకముల
నొరులకు చెల్లునే యుర్వీతలేంద్ర