పుట:సకలనీతికథానిధానము.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

123


తే.

నాఖుభుక్కునుఁ బెంచిన యతఁడు కుక్క
బొడిచె నాకుక్క నేలిన బోయవాఁడు
కుక్కఁబొడిచిన యాతని మక్కఁజేసె
పోరు ఘనమయ్యె నప్పు డప్పురము నడుమ.

341


క.

క్షితిపతి పో రుడుపఁగఁ దా
నతివేగమె సైన్యసహితమై వచ్చిన భూ
పతికిని బురజనులకు సం
యతి[1]ఘోరంబైన మడసి రందఱు నచటన్.

342


క.

పలువురు గలహము సేయఁగ
నిలిచి కనుంగొనఁగవలదు నేరమి వచ్చున్
గలహించువారిఁ గూడిన
బలవంతునకైన మానభంగము దెచ్చున్.

343


వ.

అట్లు గావున మన మచ్చట నుండవలదని ప్రధాని కవ్విధం బెఱిఁగించుటయును.

344


ఆ.

సచివశేఖరుండు చాగణరాయనిఁ
బిలువఁబంచి వానిఁ బ్రీతుఁ జేసి
పూని మేఖలకును మానభంగము సేయు
మనిన వాఁడు చనియె నక్షణంబ.

345


విలసితము:

కపటసఖ్యమునుఁ గామినితోఁడన్
(శపథ)యుక్తముగ జాగణరాయం
డుపమ మీరి సరసోక్తుల తోఁడన్
నృపతి యాత్మగరుణింపగ జేసెన్.

346


వ.

అంత నొక్కనాఁడు.

347
  1. జయతి = యుద్ధము