పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 39



వ. ఇట్లు విడిఁబడి. 145

సీ. కొసరుపల్కులఁ గ్రమ్మిఁ గోటికత్తులఁ జిమ్మి
కాసెలోఁ జెయి వేసి కదియఁదీసి
కన్నాత లాలించి కౌఁగిటఁ గదియించి
సరిబిత్త లల నెత్తి చనులనొత్తి
యల్లందులకుఁ జొచ్చి కల్లమ్ములకు వచ్చి
మెఱుఁగుచెక్కిలి గొట్టి కురులు పట్టి
తొడకంబముల నాని తోపునూకుల నూని
సందుచేసుక నొక్కి ముందు కెక్కి
తే. యదలుపులు [1]కీలుగొట్లు నెయ్యంపుతిట్లు
గళరవంబులు దుడుకులు చెలఁగ రాధ
మాధవుండును గడి దేరి మారుసాము
హాయిగాఁ జేసి సరి గెల్పు లంది రపుడు. 196

వ. అంత రాధాకృష్ణులు పరస్పరము సంభాషించి రది యెట్లనిన. 147

సీ. మగడ యాపని దీఱె మఱియొక యాటాడి
నాకును గట్టిగా న్యాయ మొసఁగి
పొలఁతి నీ పెందొడపుణ్యంబు నా కందె
లేఁతచిన్నది వట్టిరోఁత నాకు
నీకు దానికి నింత నేస్త మాయెను గృష్ణ
పొంతగా నినుఁ గూడి యింత బాగ
చెలియ నిమ్మళముగఁ జేసితివో లేక
యది చేసెనో నన్ను నడుగ వలదు
తే. బాగు బా గన గట్టిగాఁ బని యొసంగ
నియ్యరా కృష్ణ నాకును నిమ్ముగాను
ఠీవి వయసున గుణమున నీవె పెద్ద
రయము రయమునఁ గావింపు రతిని రాధ. 148

  1. పొగడికలు [మూ.]