పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134 రాధికాసాంత్వనము

ఉ. మారుఁడు చూడ నావరకుమారుఁడు బావమఱంది రాజు నా
పేరిటి వాడు మాధవుడు పేర్మిని బ్రాణపదంబు గాలి నన్
వీ రిఁక నేమి సేయుదురొ వేమఱుఁ జూచెద నీదుకోస మ
వ్వారిగ వారె బాము లిడి ప్రాణము దీసిన నిచ్చెదం జెలీ. 64

చ. నెలఁతరొ నిన్ను నమ్ముదునె నీదుకురుల్ కుటిలమ్ము లాయెఁ జూ
వులు చపలమ్ము లాయెఁ గనుబొమ్మలు వక్రము లాయెఁ గబ్బిగు
బ్బలు కఠినమ్ము లాయె మఱి భావము కర్కశ మాయె నాపయిం
గలుగుట యెట్లు నీకు దయ కన్గొనవే మది నంగనామణీ. 65

క. చిగురువిలుకానిశరములు
తగ వెన్నునఁ దూరి నేను దల్లడపడఁగా
సొగసారి యింత యోర్తురె
నగినం దగుపాటి గాక నాళీకముఖీ. 66

సీ. వలచి పాయుట పగవారికైనను గాదు
[1]మునుపుగా నన్నది మనమె కాదొ
కవఁ బాసి బ్రతికిన కాంతలఁ గాంతుల
నటు మెచ్చనిది మన మౌనొ కాదొ
మనకూటమికి నాడుకొనెడువారలకన్ను
బొడిచినరీతిని నడువలేదొ
యుదయాస్తమయముల మదిలోనఁ దలఁపక
గడియకు పలుమాఱు కలియలేదొ
తే. యిప్పటిఋణానుబంధంబు లిట్టు లుండె
నైన నేమాయె నేమైన నైనఁ గాని
సుఖముగా నున్న నెపుడైనఁ జూడవచ్చుఁ
బోయి వచ్చెద సెలవిమ్ము పువ్వుఁబోఁడి. 67

చ. అనఁ గుబుసంబు నూడ్చినమహాభుజగాంగన నా ముసుంగు తె
ప్పునఁ బెనవేసి లేచి ముడిబొమ్మ లెసంగఁ గటంబు లుబ్బఁగాఁ

  1. మహిలోన నన్నది. [మూ.]