పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

221

మసలి "సర్వం విష్ణుమయ” మనుచోటు - నెసఁగఁజెప్పెఁడుగాని యసమలోచనుఁడు
నరుదగు సర్వసంహారంబుసేయ - హరియు సర్వము ద్రుంగెనని చదువండు
హరికర్త జగముల కనియెడిఁగాని - హరికిని భర్త యీశ్వరుఁడని యనఁడు
హరి విశ్వనామాంకుఁడనియెడిఁగాని - హరుఁడు విశ్వేశ్వరుఁడని చదువండు
హరి వరాశక్తి దా ననియెడిఁగాని - హరుఁడు వరాపరుఁడని చదువండు
హరి మహామాయ దాననియెడిఁగాని - హరుఁడు మహాదేవుఁడని చదువండు
హరిహరుఁడనెడు శబ్దార్థ మెర్గమిని - హరిహరుఁడన నొక్కఁడనియెడిఁగాని
హరిని హరించుట యదిగారణముగ - హరిహరుఁడును మారహరుఁడు ననండు
పక్షపాతి పురాణభట్టు యథార్థ - మీక్షింపఁడఱచెడు నితరేతరముల
శివనిందచేసెడి యవినీతుఁజంప - నవుఁబుస్తకము గాల్ప నవుఁబథం బిదియ
యనుచు మా కక్కయ్య యా శివద్రోహిఁ - బొనరుచు నలిగి [1] డొంకెనఁబడఁబొడిచి
తలదర్గి పొట్టలోపల [2]బెట్టికట్టి - యలరుచు నున్నెడ నక్షణంబునన
ప్రక్కలైచూడఁబౌరాణికుమేను - విక్కన విరియుచు విలవిల యనుచు
బ్రువ్వులప్రోఁకయై రూపఱియున్న - నివ్విప్రు లెఱుఁగరే యిన్నియునేల
డోహరకక్కయ్య మాహాత్మ్యమెఱిఁగి - యూహింప భక్తుల నొం డనఁజనునె

భోగయ్యగారి కథ


మఱియుఁ గెంబాగిలో మహిఁజెప్పనొప్పు - కఱకంఠభక్తుఁడకల్మషకీర్తి
భోగయ్యనాఁగ నెప్పుడుఁబరమాను - రాగుఁడై జంగమార్చన సేయఁజేయఁ
గఱకంఠుఁడాయయ్య మెఱయింపఁదలఁచి - పెఱవానిక్రియనొక్క వెయ్యశవంబు
మోచికొనుచు రుద్రముద్రాసమేతుఁ - డై చూప ఱద్భుతం బంద నేతేరఁ
బొడగని సర్వాంగములుఁ బొందమ్రొక్కి - మెడనున్న పెయ్యఁ దామెడఁబెట్టుకొనుచు
దొడుకొనివచ్చి యుత్సుకలీలతోడ - నడుగులుగడుగ నామృడమూర్తి యనియెఁ
జచ్చిన పెయ్యమాంసము నారగింప - నిచ్చ నేమముగాఁగ నిన్న నేఁబోయి
ధీయుత వినవయ్య దేడరదాసిఁ - బేయఁబాకము సేసిపెట్టవే యనిన
నడిగి వచ్చెద దుగ్గళవ్వఁదా ననుచు - నెడసేసె నాఁకొంటి నింక నీవైనఁ
బెట్టవే వండించి పెయ్య నా కనిన - నట్టిదకా కంచు నపుడు భోగయ్య

  1. బొడ్చితిగిచి
  2. కుట్టి