పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బసవపురాణము - పీఠిక

తొలుదొలుతఁ దెలుఁగున ద్విపదరూపమున బసవపురాణమును వెలయించిన కవీశ్వరుఁడు పాల్కురికి సోమనాథుఁడు. బసవపురాణమును బద్యకావ్యముగా రచియించినవాఁడును, సోమనాథుని శిష్యుఁడగు శివరాత్రి కొప్పయ్య కాఱవతరమువాఁడును, సోమనాథుని గ్రంథములను బఠనపాఠనాదిరూపమునఁ బ్రచారమునకుఁ దెచ్చుచున్నవంగడము వారిలోనివాఁడును నగు పిడుపర్తి బసవనకవి తన బసవపురాణపీఠికలో సోమనాథుని చరిత్ర మీ క్రిందివిధముగాఁ జెప్పినాఁడు :

పాల్కురికి సోమనాథుని చరిత్రము

“శివాజ్ఞ చొప్పున భృంగి బసవపురాణమును లోకమున వెలయించుటకై పాల్కురికి సోమనాథకవిగా నవతరించెను. అతనిశక్తి యిట్టిది:

సీ. లిపి లిఖింపకమున్న యపరిమితార్థోక్తి, శక్తి యాతని జిహ్వ జరగుచుండు
    ఛందోధికరణాది సరణిఁ జూడకమున్న, మదినుండుఁ గావ్యనిర్మాణశక్తి
    భాష్యసంగతులు చెప్పకచూడకయమున్న, రుద్రభాష్య క్రియారూఢి వెలయు
    తర్కశాస్త్రాది విద్యలు పఠింపకమున్న, పరపక్షనిగ్రహప్రౌఢి వెలయు

గీ. నతని నుతియింప నాబోఁటికలవియగునె, జైనమస్తకవిన్యస్తశాతశూల
    కలితబిజ్జలతలగుండుగండబిరుద, శోభితుఁడు పాల్కురికి సోమనాభిధుండు.

ఒకనాఁడు శివభక్తు లోరుఁగంటిలో స్వయంభూదేవుని యాలయము మంటపమునఁ గూరుచుండి బసవపురాణమును వినుచుండఁగాఁ బ్రతాపరుద్ర చక్రవర్తి యీశ్వరదర్శనార్థమై యక్కడి కరిగి యదిచూచి " ఈ సంభ్రమ మేమి” యని యడిగెను. వారు “బసవపురాణమును వినుచుంటి” మనిరి. “బసవపురాణమనఁగా నెట్టిది” యని మరల రాజడిగెను. “ఈ నడుమఁ బాల్కురికి సోమనాథుఁడను పతితుఁడు (ప్రాసవళ్లు) వెట్టి ద్విపదరూపమునఁ గల్పించెను. అది యప్రామాణికము, అనాద్యము.” అని యొకధూర్తవిప్రుఁడు రాజుతో దాన్నిఁ