పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాతనాగరికతలు : మన వారసత్వము

37

ఈజిప్టునుగూర్చియు, క్రీటులోని ప్రాచీననగరమగు క్నోస్సోస్‌ను గూర్చియు కొద్దిగా ఇదివరలో నీకు వ్రాసియుంటిని. ప్రాచీన నాగరికతలు ఈ రెండు దేశములలోను, నేడు ఇరాక్ , లేదా మెసపొటేమియా అని పిలువబడు దేశములోను, చీనాలోను, ఇండియాలోను, గ్రీసులోను వేళ్ళు తన్నినవని చెప్పియుంటిని. మిగతవానికన్న గ్రీసుకొంచెము ఆలస్యముగా వచ్చియుండును. కాన ఇండియాలోని నాగరికత సాటినాగరికతలు గల ఈజిప్టు, చీనా, ఇరాక్ నాగరికతలతో వయస్సున సమానమగుచున్నది. ప్రాచీన గ్రీసుదేశముసైతము వీనిచెల్లెలే. ఈ ప్రాచీన నాగరికత లేమైనట్లు ? క్నోస్సోస్ నామమాత్రావశిష్టమైనది. సుమారు 3000 సంవత్సరములకు పూర్వమే అది అంతరించినది. చిన్నదైన గ్రీసునాగరికతకు సంబంధించిన ప్రజలు వచ్చి దానిని నాశముచేసిరి. ఈజిష్టయొక్క ప్రాచీననాగరికత వేలకొలది సంవత్సరములు దివ్యముగావెలిగి అంతరించినది. గొప్ప పిరమిడులు, స్పింగ్సువిగ్రహము, గొప్ప దేవాలయముల శిథిలములు, రక్షితమానవకళేబరములు మున్నగునవి తప్ప నాగరిక చిహ్నము లేమియు మిగులలేదు. ఈజప్టుదేశ మక్కడనే యున్నది. . నైలునది పూర్వమువలె ప్రవహించుచునే యున్నది. ఇతర దేశములందువలెనే స్త్రీ పురుషులందు నివసించియున్నారు. కాని నేడు నివసించు ప్రజలకును, వారి దేశముయొక్క ప్రాచీననాగరికతకును సంబంధము తెగిపోయినది, ఇరాక్, పర్షియాదేశములమాట — ఎన్ని సామ్రాజ్యము లందు వెలిసినవి కావు? ఒకదానివెనుక నొకటి అంతరించినవికావు . ప్రాచీనతమమైన పేళ్లు చెప్పిన చాలును - బాబిలోనియా, అస్సీరియా, చాల్ డియా మహానగరములగు బాబిలన్ , నినేవాలమాట. బై బిలులోని ప్రాతనిబంధనలో ఈ ప్రజల వృత్తాంతము కలదు. కొంతకాలమైనపిమ్మట, ప్రాచీనచరిత్ర కాకరమైన ఈ భూమిలో ఇతర సామ్రాజ్యములు వర్ధిల్లినవి. తరువాత వర్ధిల్లుట మానినవి. ఇక్కడ బాగ్దాదు ఉండెను. — అరేబియన్ రాత్రుల కథలలోవచ్చు అద్భుతనగరము. కాని సామ్రాజ్యములు వచ్చును.