పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



మా మాట

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూగారు తమపుత్రిక ఇందిర విద్యాభ్యాసంలో యేవిధంగానూ తోడ్పడలేక పోయారు. దేశరాజకీయాల్లో పాల్గొంటూ, అడప దడప కారాగారంలో వుండడంతో తీరికేలేకపోయింది. జైల్లో తీరిక నుపయోగించుకొని కుమార్తెకు ప్రపంచచరిత్రను లేఖల రూపంగా వ్రాశారు. ఈ లేఖలు బాల, బాలికలందరూ ప్రపంచచరిత్రను అర్థం చేసికొనుటకు ఉపయోగపడేటట్లు వ్రాశారు. 1933-35 లలో వ్రాసిన లేఖ లివి. ఆంగ్ల మూలం 1935 లో ముద్రింపబడింది. ఇప్పటికి 12 ఏండ్లు దాటినా యింత దనుక యీ పుస్తకం తెనుగులో రాకపోవడం చింతనీయం.

మే మడుగగానే ఈ ‘ప్రపంచ చరిత్ర’ను ఆంధ్రీకరించి, ప్రచురించడానికి అనుమతి నిచ్చిన రచయితకు, గృహాచ్ఛిద్రా లెన్నో వున్నా శ్రమయనక యీ 1000 పేజీల పుస్తకం అనువాదానికి పూనుకొని సాయపడిన మిత్రులు శ్రీ చింతా దీక్షితులుగారికీ మా కృతజ్ఞతాపూర్వక వందనములు.

ప్రకాశకులు

1. 4. 1950.