పుట:నవ్వుల గని-మొదటి భాగము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



నవ్వులగని

నూతన పంచాంగము.

కృమార్జాలదేవతాయైనమః

గీ. కుడుములన్ మెక్క పొంగిన కడుపు; చేట
    చెవులు; నేనుగు తొండంబు; చెవులుగొలువ
    రుబ్బు రోల్పొత్రమట్లు కూర్చుండి కదల,
    లేని గణనాధు నవ్వులకై నుతింతు.

ఈపంచాంగము కళంకీ బ్రాహ్మణమహావంశజాతుండును "కేన చిచ్చిద్దాంతినాగణిత పధకతస్కరుండుసు, కిరాత మహారాజాస్థాన విద్వాంసుడును, అగు కుండగోళక సిద్దాంతిచే రచింపంబడి, దౌర్భాగ్యపురము దగుర్బాజీపేటలోని అసృతవాదినీ ముద్రాక్షరశాలయందు దీర్ఘ వాలపు గ్రామసింహారావు పంతులు గారిచే ముద్రింపబడి లోకవినోదార్ధము ప్రకటింపంబడియె,

ఆంజనేయ స్తుతి.

గీ. భాస్కరునిగాంచి ఫలమనుభ్రమయు బుద్ధి,
   శాలి; లంకనుగాల్చిన చక్కనయ్య!
   ఆంజనేయుండు కృతిభర్తకనుదినంబు
   తనగుణంబులొనంగుచుఁ దనువుగాత,

సంవత్సర ఫలము.

ఈ సంవత్సరము గుంటూరు అత్తరువు, సాహేబులకు బేరముల వలన మంచిలాభమును సాతానులకు ముష్టివలన సుఖజీవనమును కలు