పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

33


నేటాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది. భారతీయులకు ఓటింగు హక్కు నిరాకరిస్తూ యీ బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని తెల్ల వాళ్ళంతా అంగీకరించారు రంగు భేదాన్ని పురస్కరించుకొని భారతీయులకు వ్యతిరేకంగా ప్యాసైన మొదటి చట్టం యిదే భారతీయులు దీన్ని వ్యతిరేకించారు. రాత్రికి రాత్రి ఒక అర్జీ తయారైంది. దానిమీద 400 మంది సంతకాలుచేశారు. యీ అర్జీ చేరగానే నేటాలు అసెంబ్లీ అదిరి పోయింది. అయితే బిల్లు ప్యాపైంది కదా అప్పుడు లార్డ్ రిప్పన్ అనువాడు అధినివేశ దేశాలకు సంబంధించిన మంత్రిగా వున్నాడు. అతడి దగ్గరికి 10 వేల మంది భారతీయుల సంతకాలతో మరో అర్జీ చేరింది. 10 వేల మంది సంతకాలంటే నేటాలు నందు నివసిస్తున్న స్వతంత్ర భారతీయులందరూ దాని మీద సంతకాలు చేసినట్లే. దానితో లార్డ్ రిప్పన్ ప్రభువు నేటాల్ అసెంబ్లీ అంగీకరించిన బిల్లును నిరాకరించి వేశాడు బ్రిటిష్ సామ్రాజ్యం, చట్టప్రకారం రంగు భేదాన్ని అంగీకరించదు అని ప్రకటించాడు. భారతీయులు సాధించిన యీ విజయం ఎంత ఘనమైనదో పాఠకులకు తరువాత బోధపడుతుంది. అందుకు సమాధానంగా నేటాలు ప్రభుత్వం అసెంబ్లీలో మరో బిల్లు ప్రవేశపెట్టింది. అందులో రంగు భేదాన్ని తొలగించారు. కాని పరోక్షంగా భారతీయుల్ని దెబ్బకొట్టే ప్రయత్నమే ఆబిల్లులో జరిగింది. భారతజాతి ఆ బిల్లును కూడా వ్యతిరేకించిందికాని విజయం సాధించలేకపోయింది. యీ క్రొత్తబిల్లు రెండు అర్థాలు కలది భారతజాతి తలుచుకుంటే కోర్టుల్లో ఆ బిల్లును ఛాలెంజి చేసి వుంటే బాగుండేది. ప్రీవీ కౌన్సిల్‌కు వెళ్లవలసి వచ్చినా సిద్ధపడవలసిందే కాని అలా జరగలేదు అయితే ప్రీవీ కౌన్సిలుకు పోకపోవడం సరియైన పని అని నా అభిప్రాయం, బిల్లులో రంగు భేదం అనుమాటకు తావులేకుండా జాగ్రత్తపడ్డారు. ఇంత చేసినా నేటాలు తెల్ల దొరలకు, అక్కడి తెల్లవారి ప్రభుత్వానికి తృప్తి కలగలేదు. భారతీయులు రాజకీయంగా నేటాలులో బలపడకుండా వుండటం వాళ్లకు ఆవసరం దానితోపాటు భారతీయుల వ్యాపారాన్ని నేటాలులో దెబ్బతీయడం, స్వతంత్ర భారతీయుల్ని నేటాలులో నిలవనీయకుండా చేయడం వాళ్ల లక్ష్యం 30 కోట్ల మంది భారతీయులు నేటాలు మీద