పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

351


వచ్చారు. యిక యీ సంగ్రామ అంతం ఎలా ఆరంభమైందో తరువాతి ప్రకరణంలో చూద్దాం.




47

అంతానికి ఆరంభం

భారత జాతి ఎంతటి శాంతి శక్తిని ఉపయోగించగలదో అంతశక్తిని, ఆశించిన దానికంటే అధికంగా ఉపయోగించిన వివరం పాఠకులు తెలుసుకొనే యుంటారని అంతటి శాంతిశక్తిని ఉపయోగించిన వారంతా పేదవారని, అణిచి వేయబడిన వారని కూడా పాఠకులు గ్రహించి యుంటారని భావిస్తున్నాను. ఫినిక్సులో యిద్దరు ముగ్గురు బాధ్యత గల కార్యకర్తలు తప్ప మిగతా వారంతా జైళ్లలో వున్న విషయం పాఠకులకు తెలుసు. ఫినిక్సుకు బయట వుండే కార్యకర్తల్లో కీ. శే. సేఠ్ ఆహమద్ మహమ్మద్ కాఛలియా ముఖ్యులు. వారు జైలు బయటనే పున్నారు. ఫినిక్సు వాసుల్లో శ్రీ వెస్ట్, శ్రీమతి వెస్ట్ మగన్‌లాల్ గాంధీ గారలు జైలు బయటవున్నారు. కాఛలియా సేఠ్ సామాన్య పర్యవేక్షణ చేస్తూ వుండే వారు.

కుమారి స్లేషిన్ ట్రాన్స్‌వాల్ యందు జరిగే ఆదాయ వ్యయాలు వ్రాస్తూ దేశ విదేశాలకు ప్రయాణించే వారి వ్యవహారాలు సంభాళిస్తూ వుండేది ఇండియన్ ఒపీనియన్ ఇంగ్లీషు పత్రికను నడపడం, శ్రీ గోఖలే గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం మొదలగు పనులు శ్రీ వెస్ట్ చేస్తూ వుండేవారు. క్షణక్షణం మారిపోతున్న రాజకీయ పరిస్థితుల్లో ఉత్తరాలు వ్రాయడంకుదరక, పెద్ద పెద్ద టెలిగ్రాముల రూపంలో సమాచారం పంపవలసి వస్తూ వుండేది. యిది కడుసున్నితమైన వ్యవహారం. శ్రీ వెస్ట్ యీ వసులన్నీ చేస్తూ వుండేవారు.

ఇప్పుడు ఫినిక్సు, న్యూకెసల్ మాదిరిగా నేటాలుకు వాయువ్య దిక్కున గల సమ్మె చేస్తున్న కార్మికులకు కేంద్రమై పోయింది. వందలాది మంది కార్మికులు ఫినిక్సు రావడం, సలహాలు తీసుకోవడం ప్రారంభించారు.