పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

305


భారతీయులు వాదించేవారు. నేను ధైర్యంగా వారికి నచ్చచెప్పాను. . "ఇలా చేస్తే సత్యానికి భంగం కలుగుతుంది. యుద్ధంలో సత్యమైనపట్టుదల యున్నప్పుడు అక్కడ సత్యం భంగమవుతుందని వూహించటానికి నిజమైన యుద్ధంలో పోరాడుతున్నప్పుడు సైనికుల సంఖ్య దిన దివానికి పెరుగుతూ వుండవచ్చు. కానీ యుద్ధంకోసం ప్రారంభంలో వారు ఎన్నుకున్న కారణాలు పెంచి ముందుకు వెళ్ళటానికి వీలులేదని చెప్పాను. దీనికి వ్యతిరేకంగా ఏ ఉద్దేశ్యంలో సమరాన్ని ప్రారంభించామో ఆ ఉద్దేశ్యం కోసం పోరాడే శక్తి కొన్ని దినాల తరువాత క్షీణించినా యుద్ధాన్ని ఆపివేయటానికి వీలులేదు. ఈ రెండు సిద్ధాంతాలను దక్షిణాఫ్రికాలో సంపూర్ణంగా అమలు పరచటం జరిగింది. యుద్ధ ప్రారంభసమయంలో ఏ బలాన్ని చూచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు నడవటం జరిగిందో ఆ బలం తరువాత నిర్చలమైనదిగా ఋజువవటాన్ని మనం చూశాం కాబట్టి లక్ష్యాలను కూడా పెంచటం చాలా కష్టం. ఇందులో ఎంతో సంయమనం అవసరం దక్షిణాఫ్రికాలో చాలా చోట్ల, యిలాంటి ప్రలోభాలు మా ముందుకు వచ్చాయి. కానీ నేను ఖచ్చితంగా చెబుతున్నాను. మేమీ ప్రలోభాలద్వారా ప్రయోజనాన్ని ఎట్టి పరిస్థితులలోనూ పొందటానికి ప్రయత్నించలేదు. సత్యాగ్రహికి ఒక్కటే లక్ష్యం వుంటుందని ఎన్నో సార్లో చెప్పాను అతనా లక్ష్యాన్ని తగ్గించలేడు. పెంచలేడు. అందులో నష్టం కలుగుతుందనే అనుమానమూ లేదు. వృద్ధి కలుగుతుందన్న ఆశాలేదు. మనిషి తన కోసం ఏ కొలబద్దను నిర్ధారించుకుంటాడో ప్రపంచమూ అదే కొలబద్దతో అతణ్ణి అంచనా వేస్తుంది. ఇలాంటి సూక్ష్మమైన నీతిని సత్యాగ్రహులు అనుసరిస్తామని ఏ కొలబద్దలో ప్రకటిస్తారో, అదే కొలబద్దతో వారిని అంచనా వేయటం ప్రభుత్వం మొదలెట్టింది. కానీ నీతికి సంబంధించి యిలాంటి సిద్ధాంతాలు తనను బంధించలేవని దాని నమ్మకం. ఇంతేకాక ఒకటి రెండు సార్లు సత్యాగ్రహులు నీతివి ఉల్లంఘించారని ఆక్షేపించింది కూడా. ఖూనీ చట్టం తరువాత భారతీయుల పై తీసుకువచ్చిన కొత్త చట్టాలను కూడా సత్యాగ్రహ ఉద్దేశ్యాలలో చేర్చుకొనవచ్చు. ఇది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే