పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

వాగ్దాన భంగం


భారతీయులను గురించి వ్యక్తిగత అనుభవం వుండటం వల్ల తాము బాగా తెలుసుకోవటమే కాక భారతీయులకు తెలియజెప్పటంలోనూ భారత దేశపు ధర్మాన్ని వివరించటంలోనూ వారు. నఫలులయ్యారు. మళ్లీ సమరం మొదలైనప్పుడు భారతదేశం నుంచి ధన వర్షం కురిసింది. లార్డ్ హాడింగ్ సత్యాగ్రహులపట్ల తన సానుభూతిని చూపించి వారిని ప్రోత్సాహపరచాడు (డిసెంబర్ 1913) శ్రీ అండ్రూస్, పియర్సన్ దక్షిణాఫ్రికాకు వచ్చారు. ఇదంతా గోఖలే యాత్ర జరిగి వుండకపోతే జరిగియుండేది కాదు. ప్రభుత్వం తన మాటనెలా భంగపరచిందో దాని తరువాత ఏమైందో తదుపరి ప్రకరణంలో తెలుసుకుందాం




38

వాగ్దాన భంగం

ప్రస్తుత నీతికి విరుద్ధంగా ఒక్క అడుగుకూడా ముందుకు వేయని విధంగా దక్షిణాఫ్రికా సత్యాగ్రహ సమర సమయంలో అధిక జాగరూకతతో నడుచుకోవటం జరిగింది. అనుచిత రీతిలో ప్రభుత్వాన్ని వేధించకూడదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకున్నాం. ఉదాహరణకు యీ ఖూనీ చట్టాన్ని కేవలం ట్రాన్స్‌వాల్‌లో వున్న భారతీయులకే వర్తించేలా ప్రభుత్వం చేస్తున్నందువల్ల సత్యాగ్రహ సమరంలోకి ట్రాన్స్‌వాల్‌లో వుండే భారతీయులనే భర్తీ చేసుకున్నాం. నేటాల్ కేప్‌కాలని మొదలైన ప్రాంతాల నుండి భారతీయులను భర్తీ చేసుకోవటానికి ఎలాంటి ప్రయత్నమూ జరుగలేదు. దీనికి విరుద్ధంగా అక్కడున్న భారతీయులు తెచ్చిన ప్రస్తావనలను సైతం నిరాకరించటం జరిగింది. పైగా యీ చట్టాన్ని రద్దు చేయించటమే తమ సదుద్ధేశ్యమని నిర్దారించబడింది. ఈ మర్యాదను అటు భారతీయులు గానీ యిటు తెల్లవారు గానీ అర్థం చేసుకోలేక పోయారు. సమర ప్రారంభం తరువాత ఒకవేళ యీ చట్టాన్ని రద్దు చేయించటమనే డిమాండ్‌తోపాటు తక్కిన సమస్యలనూ సమర కారణాలలో ఎందుకు చేర్చకూడదని -