పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0117-2 ఆహిరి సంపుటం; 07-098

పల్లవి:
చెప్ప వేఁగు వచ్చెనా చేరి మీకెల్లా బుద్ధులు
చిప్పిలుచు వినివిని చిల్లులాయ మనసు

చ.1:
పలుకులే వాఁడైతే పట్టవచ్చునా మఱి
అలుగులైనా వొరల నట్టుండుఁ గాక
యెలమినాతఁడాడఁగా నెట్టోరువ వచ్చునే
చెలులార వినివిని చిల్లులాయ మనసు

చ.2:
చేరి వలపు వేఁడైతే చేతనంటవచ్చునా
సూరియుఁడైనా మొయిలు చొచ్చుఁగాక
కోరి యాతఁడు దిట్టఁగా గుట్టున నెట్టుండుటే
చేరువలు వినివిని చిల్లులాయ మనసు

చ.3:
నవ్వులే నయములైతే నారొలువవచ్చునా
పువ్వులందే పిందెలును బుట్టుఁగాక
యివ్వల శ్రీ వేంకటేశుఁడెనసె నేమందునే
చివ్వన బూతులు విని చిల్లులాయ మనసు