పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0116-6 బౌొళి సంపుటం: 07-096

పల్లవి:
నేనింత సేసితినంటా నేరమెంచేవు గనక
తానే నన్నంటెఁ జుమ్మీ తప్పులేదు నాయందు

చ.1:
పొద్దున నీయింటికి నీపాందులు సేయవచ్చితే
సుద్దులు చెప్పఁగ వచ్చీఁ జూడవె తాను
బుద్దులెఱుఁగుదునంటా పారుగుపోరచి యంటా
ఉద్దండానఁ జన్నులంటీ నోయక్కరో వీఁడు

చ.2:
నీమగఁడు బావంటా నే వద్దఁ గూరుచుండితేను
కామించి కౌఁగలించెను కానీవే తాను
నేమము వట్టితినంటా నేనే వేరటాలనంటా
ప్రేమమున మోవితేనె పెట్టెఁగదే వీఁడు

చ.3:
మాటాడఁ బనిగలిగి మరి నిన్ను లేపరాఁగా
యీటుగాఁ గూడె శ్రీ వేంకటేశుఁడే తాను
నీటు నీ చెల్లెలనంటా నీమారు నేనంటా
గీఁటుచుఁ దమ్ములము పుక్కిట నించె వీఁడు