పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0116-5 గౌళ సంపుటం: 07-095

పల్లవి:
వనితల తలఁపులు వడ్డికిఁ బారీ నీమీఁద
యెనయుమెక్కడనైనా యేదుగాను సతుల

చ.1:
చేతి నేసవడ్డవారు చేరియున్నారు నీవారె
ఆతల మరిఁ జెనకుమదిలాభము
లాతుగాఁ బదారువేలు లాయాలు నీనగరెల్లా
యీతలనింకాఁ గూర్చుమేదుగాను సతుల

చ.2:
కలయఁ గొనినవారు కలరూరెల్లా నీవారే
అలరి మరిఁ గలయుమదిలాభము
తొలఁకే నందవ్రజపుదొడ్లే నీయందలాలు
యెలమినింకానుఁ దెమ్మా యేదుగాను సతుల

చ.3:
ఉరము శిరసు వీఁపందున్నవారు నీవారె
అరయుమష్టమహిషులది లాభము
ధర శ్రీ వేంకటేశ నీతావెల్లా రాణివాసాలే
యిరవై మమ్మూనేలితివేదుగాను సతుల