పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0116-1 సాళంగనాట సంపుటం: 07-091

పల్లవి:
ఏమి చెప్పేది నీనేర్పు యెంతవాఁడవు
వామి వలపాక్కమాటే వారవట్టేవా

చ.1:
దగ్గరి రాదంటాను తరుణినేల తిట్టేవు
సిగ్గులు వడఁగవద్దా చిన్నదానికి
వెగ్గళించే ఱట్టుడుల వేమారుఁ బొంది పొంది
యెగ్గులు నెమ్మెలు నేఁడు యీడఁజూపేవా

చ.2:
ఉరుటుగాఁ జూడదంటానువిదనేల జంకించేవు
శిరసు వంచఁగవద్దా చిన్నదానికి
వెరవైన సతులతో వేమారు నవ్వి నవ్వి
యిరవైన అలవాట్లీడఁ జేసేవా

చ.3:
చన్నులవొత్తదంటాను సతినేల జరసేవు
చెన్నుమీర మొక్కవద్దా చిన్నదానికి
యిన్నిటా శ్రీ వేంకటేశ యీపెఁగూడి వురముపై
యెన్నికమీరఁ బెట్టుక యింపుచల్లేవా