పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూస:Left margin5em
రేకు: 0115-4 కాంబోది సంపుటం: 07-088

పల్లవి:
ఇటువంటివారి పొందులింపులాయ నీకు
అటమటాలు నేమైతేనంతేసి నేరముగా

చ.1:
బిగువుఁగొనగోళ్ళను బిరుదులే తొలఁకీని
మొగమిచ్చకుఁ జేతులు మొక్కిఁ గాని
తెగువలు కన్నులను తేరి కెంపులెక్కీని
నగవులే సెలవుల నయమిచ్చీఁ గాని

చ.2:
గట్టి చను మొనలైతే కరసానఁ బట్టీని
వొట్టుక మాటలె తేనెలూరీఁ గాని
జట్టిగొన్న బొమ్మలైతే జంకెనలే చూపీని
దట్టపుఁ జక్కందనమే తమిరేఁచీఁ గాని

చ.3:
మచ్చిక జవ్వనమైతే మనసెల్లాఁ గరఁచీని
కొచ్చి కోరికలే ఆస కొలిపీఁ గాని
అచ్చపు శ్రీ వేంకటేశ అలమేల్‌ మంగను నేను
నిచ్చలుఁ గూడితి నాపె నిన్నుఁ గూడెఁ గాని