పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రెకు: 0115-3 కాంబోది సంపుటం: 07-087

పల్లవి:
చవి గంటి విడువఁడు సారె సారె నేపనులు
యివల నీతని పొందులెట్టు స్‌్‌టె

చ.1:
పాలమీఁదఁ బవ్వళించి పాల వారి యింటఁ బుట్టి
పాలు దొంగిలించినట్టి బాలుఁడీతఁడు
గాలికూటివాని మెట్టి గాలి రాకాసునిఁ గొట్టి
గాలిబిడ్డ తమ్ముని సంగడి నాడె నీతఁడు

చ.2:
పసుల యేలిక నా పసులకు మారు దెచ్చి
పసులఁ గాచిన యట్టి బాలుఁడీతఁడు
వసుథ భారము దించి వసుధ కొడుకుఁ గొట్టి
వసుధ యేలిన యట్టి వాఁడు గదె వీఁడు

చ.3:
బండి బోయుఁడైవచ్చి బండి గాలి కత్తి వట్టి
బండి విఱచినయట్టి బాలుఁడీతఁడు
కొండ యెత్తి కొండ దచ్చి గురుతై శ్రీ వేంకటాద్రి
కొండపై నలమేల్‌ మంగఁ గూడినాఁడితడు