పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0114-3 రామక్రియ సంపుటం; 07-081

పల్లవి:
ఏల నీకు నీవే పతినింత సేసేవే
మేలు మీఁదనుండితేనే మెచ్చవచ్చుఁగాక

చ.1:
మచ్చిక చుట్టాలైతే మర్మాలెత్తుదురా
యిచ్చకములాడితేనే యింపులుగాక
తచ్చి నీరు వేఁడైతే తామర వోరుచునా
చెచ్చెరఁ జల్లనైవుంటేఁ జెంగలించుఁ గాక

చ.2:
వొడఁబాటు గలవారు వొచ్చము పట్టుదురా
ఆడరి సరసమాడేదందముగాక
బెడసి కూడు వేఁడైతే పెదవులోరుచునా
జడిసీ దగు పాటైతేఁ జవి వుట్టఁ గాక

చ.3:
కౌఁగిటఁ గడినవారు కడమ వెట్టుదురా
వీఁగక పెనఁగితేనే వేడుక గాక
ఆఁగెను నిన్నురముపైనట్టె శ్రీ వేంకటేశుఁడు
వేఁగా తీగెకుఁగాయ వినోదమేకాక