పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0114-2 పాడి సంపుటం: 07-080

పల్లవి:
ఆతఁడు నీవును నేకమైనట్టే వుందురుగాక
యీతల నాతలా బింకాలేల దూసేరే

చ.1:
మచ్చిక చేసినవారు మాటలఁ గొసరుదురు
పచ్చిగా నవ్వేటివారు పైకొందురు
విచ్చిన విడైనవారు వెఱపు లేకుండుదురు
యెచ్చుకుందులు మీలోననేల పట్టేరే

చ.2:
పొద్దువోని యట్టివారు బొమ్మల జంకింతురు
వద్దనున్నవారు లోలో వాసి రేఁతురు
కోద్టిమీరినట్టివారు గురులు దాఁకింతురు
యిద్దరూను పంతాలకు యేల పెనఁగేరే

చ.3:
చనవులు గలవారు సరసాలు చూపుదురు
తనియఁ గూడెడివారు తమకింతురు
యెనసితిరి శ్రీ వేంకటేశుఁడు నీవును నిట్టే
యినుమడించెఁ దగవులేల పెట్టేరే