పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0114-1 ఆహిరి సంపుటం; 07-079

పల్లవి:
నమ్మవా యింకా నీవు నామనసు
చిమ్ముఁ బలుకుఁ దేనెల సేద దేర్తుఁ గాక

చ.1:
ఇయ్యకొన్నదాన నీకు నెదురాడేనా నేను
నెయ్యపుటిచ్చకములే నెరుపేఁ గాక
పయ్యెదకొంగు వట్టేవు బలిమికత్తెనా యింత
వొయ్యన నీప్రియములకొడిగట్టేఁ గాక

చ.2:
వలచినదాన నీకు వసము గాకుండేనా
పలుమారు నీచిత్తము పట్టదుఁ గాక
తలఁపు నాతోఁ జెప్పేవు తగిలి వింతదాననా
కలిసినట్టే కలసి కైకొనేఁ గాక

చ.3:
నీవే నేనైనదాన నెరుసులు వెదకేనా
చేవమీరి నీరతులఁ జెలఁగేఁ గాక
శ్రీవేంకటేశ నన్నుఁ జిత్తగించి కూడితివి
పూవులు వాసన వలెఁ బొంది వుందుఁ గాక