పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0113-5 రామక్రియ సంపుటం: 07-077

పల్లవి:
పొద్దువోదా నీక దేమి పోరులేలే
పెద్దరికెము సేసితే బిగిసేవేమే

చ.1:
బల్లదురాలవైతే భ్రమయించవే పతిని
పల్లదపు మాటలకుఁ బనిలేదే
వెల్లవిరి నాతనికి వేడుక మీఁది వారము
తల్లడించి మమ్ము దూరఁ దగవేదే

చ.2:
కలిమి గలిగితేను గడు సింగారించుకోవే
చులుకఁదనానఁ జూడఁ జోటులేదే
వలపులు చవిగాఁగా వాసికెక్కిన వారము
చలివాసి వాదించ సంగతేదే

చ.3:
చేయి మీఁదైనదానవు చేఁతలు సేయించుకోవే
మాయలు మాతో నింకా మఱి యేలే
యీయెడ శ్రీ వేంకటేశుఁడెనసె నన్నిన్నిటను
నీయిచ్చ నేరములెంచ నెపమేదే