పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0113-4 మంగళకౌాశిక సంపుటం: 07-076

పల్లవి:
నిండుమోహమున నాపె నిలుచున్నదీమేలు
వండ వండనట్లాయ వచ్చేవో రావో

చ.1:
పిలువంగఁ బిలువఁగ బిగిసేవు సారెసారె
చలము సాదింతురా సతులతోను
తలఁపు గడుమెత్తన దంటతనమే గాని
వలవని సటలేల వచ్చేవో రావో

చ.2:
తడవఁగఁ దడవఁగఁ దప్పించుకోఁ జూచేవు
నిడివిఁ బెట్టుదురా నెలఁతలను
వడిసీఁ జెమటలు నీకు వట్లి దీమసమె కాని
వడచల్లీ విరహము వచ్చేవో రావో

చ.3:
కూడఁగఁ గూడఁగఁ గొసరేవు మీఁద మీఁద
తోడనె యలయింతురా తొయ్యలులను
వేడుకతో దగ్గరి శ్రీ వేంకటేశ కూడితివి
వాడికెగా నిట్లనే వచ్చేవో రావో