పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0113-3 సామంతం సంపుటం: 07-075

పల్లవి:
మాటలు నేరుతువే మాపుదాఁకాను వోరి
మాటలాడినట్లే వుండు మంతనపుఁ జేఁతలు

చ.1:
ఇంతలోనే నవ్వేవు యేమే చెలి అవురా
యెంత కెంత కోపగించేనెందాఁకాను
పంతములాడవదేమే పలుమారును నీవు
అంతేసి పాడినడుపేవందుమీఁదఁ గలదా

చ.2:
ఇచ్చకమేల సేసేవే యింతిరో నాకు
మచ్చరించితే నివు మాట వినేవా
వొచ్చెములెంచవదేమే వొక్కమాటును నిన్ను
మెచ్చినందుమీఁదటను మెరమెర గలదా

చ.3:
కన్నులనేల మొక్కేవే కలికి నాకు నిన్ను
యెన్నికె తిట్లు దిట్టి యేమి గనేరా
నన్నెఱిఁగి కూడితివి జవరాలవే
మన్నన శ్రీ వేంకటేశ మనసిచ్చితివిరా