పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0111-5 శ్రీరాగం సంపుటం; 07-065

పల్లవి:
ఇంతమోహించిన పతివిన్నియును నీకుఁ జవి
యెంతలేదు నేమెల్లా నిటువంటివారము

చ,1:
కోమలులు మీఁదమీఁద కోపగించినాఁ జవి
దీమసానఁ బెదవులఁ దిట్టినాఁ జవి
నేమమున మాటాడఁగా నేరకుండినాఁ జవి
వోముచును ముద్దరాలైవుండినాఁ జవి

చ.2:
చనవుల బొమ్మలను జంకించినాఁ జవి
చెనకి గబ్బితనాలు చేసినాఁ జవి
వనజము వంటి మోము వంచుకొనినాఁ జవి
గునిసి కొప్పుభారాన కొంకినాఁ జవి

చ.3:
చెక్కు చేతి తోడుత సీగ్గువడినాఁ జవి
మొక్కలపు నవ్వులెల్లా ముంచినాఁ జని
యెక్కువతో శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
వొక్క మనసున నిట్టే వుండుటే చవి