పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0111-4 ముఖారి సంపుటం: 07-064

పల్లవి:
అదివో నిన్నంటిఁగా అప్పుడే నిన్ను వోసి
తుదమొదలెఱఁగక దోసమేలాడేవే

చ.1:
అట్టె కోపించకుమీ అడిగే నేనొాకమాట
యెట్టునెదుర వున్నాపె యేమౌరా నీకు
ఉట్టిపడి వోసిపోవె వొకటికొకటి గట్టేవు
చుట్టపు వరుస వారి సోఁకనాడవచ్చునా

చ.2:
సిగ్గువడకుమీ వోరి చెప్పేరా నేనొకమాట
దగ్గరి కూచుండనాపె తనకేలరా
వొగ్గి మాటలాడితే వూరకే నిందవేసేవు
నిగ్గులవారితో వాదు నీకింత వలెనా

చ.3:
నవ్వకు శ్రీ వేంకటేశ నమ్మించే నేనొకమాట
యివ్వలఁ బండుండ ఆమె యేమౌరా నీకు
పువ్వక పూచెననేవు పారుగిరుగులవారి
రవ్వసేయకువే యింత రతి నిన్నుఁ గూడనా