పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0111-3 సామంతం సంపుటం: 07-063

పల్లవి:
నీవంటి సతులతో నెయ్యమాతఁడు చూపఁగా
ఆవలిమోమై యుందానవారడింత గలదా

చ.1:
సిగ్గున నుందానవో చింతతోనుందానవో
సిగ్గుకుఁ జింతకు సాక్షి చెక్కిటిచేయే
దగ్గరి నీరమణుఁడు తమకించి పిలువఁగ
అగ్గలమయ్యే వదేమే ఆఱడింత గలదా

చ.2:
మాయలు ససేవో మంతనాననుందానవో
మాయకు మంతనానకు మంచమే సాక్షి
చేయివట్టి యాతఁడు నీచింతదిరఁ దియ్యఁగాను
ఆయాలు దాఁక దొబ్సేవు ఆఱడింత గలదా

చ.3:
కరుణ నీకుఁ బుట్టెనో కాఁకలు నీకు ముంచెనో
కరుణకుఁ గాఁకలకు కాఁగిలే సాక్షి
అరుదై శ్రీ వేంకటేశుఁడట్టె నిన్నుఁ గలసెను
అరమరచేవు మేను ఆఱడింత గలదా