పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0111-2 కాంబోది సంపుటం; 07-062

పల్లవి:
తారుకాణలై యుండఁగ దాఁచనేల
కూరిమెల్ల నీమీఁద గుంపులైన యట్లు

చ.1:
కలువ పువ్వుల బంతి కన్నులనదుముకొని
బలువుగ నిన్ను వేసెఁ బడఁతి యిదె
సాలసి తాఁజూచినట్టి చూపులు నీకుఁ దెలిపి
సళుపు మరునమ్ములు సాక్షివెట్టినట్లు

చ.2:
తుంచి తమలపాకుల తొడమెలు నీమీఁద
ఇంచుకించుకె వేసెనిందరుఁ జూడ
ముంచి చిగురుమోవినీమోవి మోఁపెనని చెప్పి
పాంచి వసంతుని నీకుఁ బూఁటవెట్టినట్లు

చ.3:
మొగలీిరేకుల లేఁతముంటికొన నీమెను
వగగా రేకలు దీసె వంకలుగాను
తగు శ్రీ వేంకటేశుఁడ తరుణి దనపెండ్డికి
మొగిఁ జందురులనెల్ల మూఁకగూర్చినట్లు