పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0110-6 గౌళ సంపుటం: 07-060

పల్లవి:
పూవుఁబోణుల కొలువే పుష్పయాగము
పూవక పూచి నీకిట్టె పుష్పయూగము

చ.1:
కలువ రేకుల వంటి ఘనమైన కన్నుల
పాలఁతుల చూపులె నీ పుష్పయాగము
తలఁచి తలఁచి నిన్నుఁ దమమేనులఁ బొడమే
పులకజొంపములె నీ పుష్పయాగము

చ.2:
కరకమలములను కందువ గోపికలెల్లా
పారసి నినుఁ జూపుటే పుష్పయాగము
సరసపు మాటలే సారెనాడి తమనవ్వు
పారి నీపైఁ జల్లుటే పుష్పయాగము

చ.3:
గాఁట్టపుఁ గొలనిదండఁ గాంతలు సిగ్గున నిన్ను
బూటకానకుఁ దిట్టుటే పుష్పయాగము
యీటున శ్రీ వేంకటేశ యిట్టె యలమేలుమంగ
పూఁటవూఁటరతులివి పుష్పయాగము