పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0110-5 రామక్రియ సంపుటం: 07-059

పల్లవి:
ఉండనీరా యీపాటి వూరకే నన్ను
కొండెగోడితనాలకుఁ గోపమెల్లా వచ్చును

చ.1:
చుట్టుమవుతానెఱఁగము సూడుబంటవో యెఱఁగ
మట్టె నాతో నాపె సుద్దులాడుకొనేవు
ముట్టి ముట్టి నేము సీతో ముచ్చటలు చెప్పుకోఁగా
యెట్టు వచ్చునో యెఱఁగమేమీనననొల్లము

చ.2:
నగవవుతా నెఱఁగము నాటకమో యెఱఁగము
తగవు నన్నడిగేవాతరుణిమాట
నిగిడి పోపో చాలు నిన్నునెవ్వఁడెఱుఁగును
యెగసక్కిఁడవు తొల్లే యేమీనననోపము

చ.3:
నెపమవుతా నెఱఁగము నెయ్య మవుతానెఱఁగము
యిపుడు వచ్చితిరి మాయింటికి మీరు
అపుడె శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
చపలతఁ గూడితిని సాదించ నేనోపను