పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0200-6 ముఖారి సంపుటం: 07-596

పల్లవి:
నాకుఁ దెలియదు నీనాటకములు
దాకొంటి విప్పుడెందలివాఁడవో

చ.1:
నగవు నాతోఁగొంత నవ్వుతానే ఆవలఁ
బగటు మరియుఁగొంత పచరింతువు
మొగిచి నీమనసు యిరుమొనసూదియైయిపుడు
తగిలీని నీవు యెందలివాఁడవో

చ.2:
పలుకులొకకొన్ని నాఫైఁ జల్లుతా నవల
వలపులొకకొన్ని నివ్వటిలింతువు
తొలఁగకిటు రెండుచేతుల వెలంకాయలై
తళుకొత్తెఁ జేఁతలెందలివాఁడవో

చ.3:
యిప్పుడిన్నిట నన్నునెనసి యెమ్మెలు నవల
చెప్పికొన్నిట నన్ను జింతింతువు
చిప్పి లుచునిందుకే శ్రీ వెంకటేశ్వరుఁడ
దప్పిదేరెదవు యెందలివాఁడవో