పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/596

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0200-4 ఆహిరి సంపుటం; 07-594

పల్లవి:
ఎక్కడికెక్కడి ఆస యేమి సేసేనే
యిక్కడ నాతో నవ్వె నిది యంత చాలదా

చ.1:
కాయమంటిన నన్నునేలే కాఁగలించవలెనా
చాయల నన్నుఁ జూచినచాలదా యింత
మాయల వలపులేల మాపుదాఁకా జోలీయాల
వేయిటికొక్కటే నన్ను విడువఁడు చాలదా

చ.2:
వొంటినున్న నన్నుఁజేరి వొడియంటవలెనా
జంటయై మాటలాడినఁ జాలదా యింత
పెంటల సరసమేల బేసబెల్లితనమేల
తొంటిపాందే వొకలక్ష తోయలేఁడు చాలదా

చ.3:
పలుమారు నాకునింత బాససేయవలెనా
అలపు దీరఁగఁ గూడెనంత చాలదా
చెలఁగి శ్రీ వెంకటేశుచేఁతలఁ బడఁగనేల
పలికినదే పంతము పచ్చిసేసెఁ జాలదా