పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0200-3 బౌళి సంపుటం: 07-593

పల్లవి:
మానరే ఆతనినేల మండాడేరు
కానుక మామొక్కులివి కడ్డాయము గాదు

చ.1:
తనకే సెలవయ్యిన తరుణి నేను
వనితలు పెక్కుగలవాఁడాతఁడు
యెనసిన మాపాందులేడకునేడ
మొనసి నేఁజేసే బత్తి మొగచాటే కాదా

చ.2:
వొక్కచో తానే గతై వుండుదు నేను
పెక్కుచోట్ల మెట్టేటి ప్రియుఁడాతఁడు
మక్కళించి మామాటలు మరియింకానా
వుక్కుమీరితే వలపు వుంగిటే కాదా

చ.3:
కందువఁ దన్నుఁ గూడిన కాంతను నేను
యిందరిలో శ్రీ వేంకటేశుఁడాతఁడు
ముందు వెనకల మేలు మోపులాయను
విందుమీఁద విందులైతే వెగటులే కావా