పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0200-2 శుద్దవసంతం సంపుటం: 07-592

పల్లవి:
ఊరకున్నవారితోడ నూరెల్లానోపునటే
వోరపోరల తోడను వూరకున్నఁ జాలదా

చ.1:
చెలిమి సేసినచోట సిగ్గులనెగ్గులూలేవు
అలుగఁగఁ దగునటే ఆతనితోను
పెలుచమాటలుగదే బెట్టికోపాలురేఁచీని
వొలిసి మోనముతోడ వూరకున్నఁ జాలదా

చ.2:
చనవులిచ్చినచోట సాదించఁబనిలేదు
పెనఁగి వేసరింతురా ప్రియునినింత
చెనకులింతే కదే జిగిరేసు వుట్టించు
వొనర నవ్వులు నవ్వి వూరకున్నఁ జాలదా

చ.3:
గక్కనఁ గూడినచోట కాఁతాళించ మరివొద్దు
కక్కసములేలే శ్రీ వేంకటపతితో
వొక్కటైనదిందే కదే వొగి మందెమేళమాయ
వుక్కుమీర లోలోఁజొక్కి వూరకున్నఁ జాలదా