పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0200-1 మంగళకౌశిక సంపుటం: 07-591

పల్లవి:
ఏల నీవు దాఁచేవు యింతలో మాకు
తాలిమినిలుచునందు తగులములున్నవి

చ.1:
అంచల మూఁకలలోనున్న అతివపై నీవు గొంత
ముంచిన నవ్వులలోన మోహమున్నది
తుంచి తుంచి తామెరల తూండ్లు నీవు వేయఁగ
వంచిన యాపెచూపుల వలపులునున్నవి

చ.2:
ఆసపడి నీవిప్పుడు అండనుండి యేమేమో
సేసిన చేఁతలలోన సిగ్గులున్నవి
సేసవెట్టి పువ్వులను చిమ్మిరేఁగ నన్నలను
వాసిన 'యాపెవ్రాలలో వాడికెల్లానున్నది

చ.3:
తోడనె శ్రీ వెంకటేశ దొరసి మీరిద్దరును
కూడిన కూటమిలోన గురులున్నవి
వాడుదేర నేఁడాపె వంకలొత్తి నీచేతికి
వీడెమిచ్చినందులోనే వేడుకెల్లానున్నది