పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/591

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0199-5 నాదరామక్రియ సంపుటం; 07-589

పల్లవి:
ఎచ్చరిక మఱవకు మిన్నిటానమ్మ
విచ్చనవిడాయ నీకు వేడుకలమ్మా

చ.1:
మితిమీరి సోబనాలమీఁద నీవు నడవఁగ
నతఁడు కైలాగిచ్చీ నదిగోవమ్మా
రతిసేసి అలసిన రమణివి తొలుతనే
చతురునికిని నీకు జతనమమ్మ

చ.2:
మేడయెక్కి అలసి నీమేను చెమరించఁగాను
ఆడ సురటి విసరీ నదిగోవమ్మా
వాడుదేరె వదనము వనితవందుకుఁ దోడు
యీడుజోడయ్యినది మీకు నెడపరాకమ్మ

చ.3:
చప్పరమాళిగెలోన సరిఁ బవళించే నీకు
నప్పుడే తాఁ దొడచాఁచీ నదిగోవమ్మా
కప్పి శ్రీ వెంకటేశుఁడు కలసె నివ్వెరగైతి
రెప్పుడు మరవకుఁడీయెన్నికలోయమ్మా