పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0110-4 సాళంగనాట సంపుటం: 07-058

పల్లవి:
చొల్లెపుఁ జట్టుతోడి చుంగుల రాజసముతో
వెల్లవిరిగానేఁగీ వెలఁదులు గొలువ

చ.1:
వీఁపునఁ గుచాలు మోఁపి వెలఁది కౌఁగిలించఁగా
నేపున నేనుగనెక్కెనిదె దేవుఁడు
చేపట్టి యాపెచేతులు చేతులఁ బిగ్గెఁ బట్టుక
పైపై వీధులవెంటఁ బరువుదోలీని

చ.2:
అంగనకుఁ దన పాదాలంకె వన్నెలు సేసుక
రంగుగాఁ దొడఁదొడము రాయఁగాను
సింగారపు సొమ్ములతో చెంగావి ముసుఁగుతోడ
అంగవించి యాపె దనకాసలు రేఁచఁగను

చ.3:
కలకల నవ్వుతోడ కస్తూరి నామముతోడ
అలమేలుమంగ దన్నునట్టె మెచ్చఁగా
యెలమి శ్రీ వేంకటేశుఁడేతులు నెరపుతాను
బలిమి నంకుశమునఁ బట్టి వొ త్తీనదివో