పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0199-1 సాళంగనాట సంపుటం: 07-585

పల్లవి:
అంకెకు రానిపనులై నపాటి చాలును
మంకులు చెల్లవు నిన్ను మరిగినదానను

చ.1:
పచరించి నీకు విన్నపములు సేసేవారి
వచనాలలోనే కానవచ్చె వలపు
రచనలు నేరుతుము రాజసాలు నేరుతుము
వుచితముగాకుండఁగా వూరకున్నదానను

చ.2:
సగము మొగము వంచి సన్నలు సేసేవారి
నగవందే అంతా వున్నది నిజము
పగటు నెరుఁగుదుము పంతమూనెరుగుదుము
జగడాలు చేరీనంటా సమ్మతించుకొంటిని

చ.3:
ఆయములు చూపి మోపి అప్పణలిచ్చేవారి
కాయకపు మొక్కులకే కలిగె మేలు
యీయెడ శ్రీ వెంకటేశ యిటు నిన్నుఁ గూడితిని
చేయి మీఁదై నవ్వులకు సెలవు పెట్టితిని